టీమిండియా మాజీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌కు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. తనకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని తెలిపాడు.
భారత జెర్సీ ధరించడం గొప్ప అనుభూతి: జహీర్