కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్ నడుస్తున్నది. రోడ్డు మీదకు వచ్చినవారిని సరైన కారణం చెబితే పోలీసులు విడిచిపెడుతున్నారు. లేకపోతే కేసులు పెట్టి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఓ కారును ఆపి ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించినందుకు ఓ యువతి పోలీస్‌తో గొడవకు దిగింది. అంతటితో ఆగకుండా పోలీస్ చేయి కొరికింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో రోడ్డుపైకి వచ్చిన క్యాబ్‌ను పోలీసులు ఆపి బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించి డ్రైవర్‌ను దింపారు. క్యాబ్‌లో కూర్చున్న యువతి బయటకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఆమెతోపాటు ఉన్న యువకుడు కూడా పోలీసులతో గొడవపడ్డాడు. ఇంతలో విచక్షణ కోల్పోయిన ఆ యువతి పోలీస్ చేయి కొరికింది. దీంతో తన నోట్లోకి రక్తం రావడంతో ఆ రక్తాన్ని మరో పోలీస్ డ్రెస్‌పై ఉమ్మేసి అక్కడి నుంచి వెళ్లిపోయినా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
పోలీస్ చేయి కొరికిన యువతి