ప్రస్తుత జీవన విధానంలో సోషల్ మీడియా పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో ఏ విషయం అయిన సోషల్ మీడియా ద్వారా ప్రజలకి ఇట్టే చెరిపోతుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు ఆయన తనయుడు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. @AlwaysRamCharan పేరుతో చరణ్ ట్విట్టర్ ఐడీ క్రియేట్ చేసుకోగా ప్రస్తుతం అతనికి 5 వేలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత కొద్ది రోజులుగా ఫేస్ బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌కే పరిమితమయ్యారు. సినిమా లేదా పర్సనల్ విషయాలని ఈ రెండింటిలోనే షేర్ చేస్తుంటారు. తాజాగా ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ తన తొలి పోస్ట్ షేర్ చేశాడు. కరోనా నివారణ చర్యలలో భాగంగా ప్రభుత్వంకి తన వంతు సాయం అందించబోతున్నట్టు పేర్కొన్నాడు చెర్రీ.
పవన్ కళ్యాణ్ గారిని స్పూర్తిగా తీసుకొని తాను రూ. 70లక్షల రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ మొత్తాన్ని కేంద్రం, రెండు తెలుగురాష్ట్రాల సహాయ నిధికి వితరణగా అందజేయనున్నట్టు చరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. కరోనాని తరిమి కొట్టేందుకు పీఎం ప్రధానమంత్రి, సీఎంలు కేసీఆర్ గారు, జగన్‌మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారు. జనాలలో చైతన్యం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. బాధ్యత గల యువకులు రూల్స్ తప్పక పాటించాలని కోరారు చరణ్.