ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. దక్షిణ కొరియా నుంచి రాష్ట్రానికి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ప్రత్యేక చార్టర్ విమానంలో తీసుకొచ్చారు. ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితం తేలనుంది. కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ర్యాపిడ్ కిట్లను వినియోగించనున్నారు. ఇన్ఫెక్షన్ ఉందా..లేదా? అని నిర్ధారించడమే కాకుండా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గినా కూడా ర్యాపిడ్ కిట్లు గుర్తించనున్నాయి.